సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించే ప్రతీ వినతిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవా రం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పరిశీలించి సంబంధత అధికారులకు ఎండార్స్ చేశారు. అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన పాల్గొన్నారు.
దరఖాస్తులు కొన్నింటి వివరాలు..
● తనకు గతంలో ఉన్న రేషన్ కార్డును అధికారులు కారణం లేకుండా రద్దు చేశారని, తిరిగి మంజూరు చేయాలని పాల్వంచ మండలానికి చెందిన వై.నాగలక్ష్మి కోరారు.
● అశ్వారావుపేట మండలం నందిపాడు ప్రాంతానికి చెందిన బత్తుల జానకమ్మ తనకు గతంలో అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కింద రేషన్ అందేదని, ప్రస్తుతం రేషన్ నిలిపివేశారని తెలిపారు. తాను వితంతువునని, సంతానం కూడా లేదని, తిరిగి ఏఏవై రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరారు.
● లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని చాతకొండ ఎస్సీ కాలనీకి చెందిన మేక రజని ఇంటి స్థలం మంజూరు చేయాలని విన్నవించారు.
● కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని సఫాయి బస్తీకి చెందిన మహమ్మద్ జరీనా బేగం తాను పోలియో బాధితురాలినని, 2023లో ప్రభుత్వం అమలు చేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన లాటరీ ద్వారా తనకు ప్లాట్ నంబర్ 602 కేటాయించినట్లు తెలి పారు. అద్దె భారం కారణంగా మరో ప్రాంతానికి మారిన సమయంలో అధికారులు తనిఖీకి వచ్చి నప్పుడు సరైన సమాచారం అందకపోవడంతో తనకు కేటాయించిన ఇంటిని రద్దు చేశారని వివరించారు. తనకు గతంలో కేటా యించిన డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని తిరిగి మంజూరు చేయాలని కోరారు.
ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్


