భద్రాచలం: అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఆదేశించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. అనంతరం వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దరఖాస్తులను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ, భూ సమస్యలు, పింఛన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యక్తిగత సమస్యలు, నిరుద్యోగుల సమస్యలపై ప్రజలు సమర్పించిన వినతులను పరిశీలించి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా చూడాలన్నారు. డీఏఓ భగవాన్‌రెడ్డి, నాయబ్ తహసీల్దార్ వినయ్‌శీల శ్రీరామ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


