సూపర్‌బజార్(కొత్తగూడెం): సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. సోమవారం ఆయన హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించారు. మొదట ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ పుష్పగుచ్ఛం అందించి ఎస్పీకి స్వాగ తం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పునరుద్ధరించిన డాగ్ కెన్నెల్, బీడీ టీమ్ రూమ్, మెన్ బ్యారక్స్‌ను ఎస్పీ ప్రారంభించారు. మోటార్ వాహనాల పార్కింగ్ కోసం నూతనంగా నిర్మించిన షెడ్డు ప్రారంభించారు. డాగ్‌ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వసతులు, బ్యారక్స్‌ను పరిశీలించారు. అనంతరం ఓఎస్డీ కార్యాలయంలో పునరుద్ధరించిన ఆపరేషన్ ఆర్‌ఐ కార్యాలయ గది, మెన్ బ్యారక్స్‌ను ప్రారంభించారు. సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎస్‌బీ ఇన్‌స్పెపెక్టర్ శ్రీనివాస్, ఆర్‌ఐలు సుధాకర్, రవి, నరసింహారావు, లాల్ బాబు, కృష్ణారావు పాల్గొన్నారు.
విజేతలకు ఎస్పీ అభినందన
జాతీయస్థాయి కుంగ్‌ఫూ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఎల్.హర్షిత్ కుమార్, వి.శరణ్య సీహెచ్ సాత్విక, వి.సాయి శృతి పతకాలు సాధించారు. విజేతలను సోమవారం ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో సోమవారం అభినందించారు. సీసీ విజయ్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాస్, మాస్టర్ పి.కాశీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్ రాజు


