సీతారామా.. ఇదేమి మాయ !? | - | Sakshi
Sakshi News home page

సీతారామా.. ఇదేమి మాయ !?

Nov 2 2026 12:17 AM | Updated on Nov 2 2026 12:17 AM

ఒకే బావికి ముగ్గురి పేర్లతో..

ఒకే బావిపై ముగ్గురి పేర్లతో అవార్డు? ఇంకొందరికి అధికంగా పరిహారం.. అర్హులకు మాత్రం మొండిచేయి

బావి, పైపులు పోయినా..

మూడు కుంటలే మిగిలింది..

తిరుమలాయపాలెం: సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల భూముల్లోని బావులు, బోర్లు, పైపులు, చెట్లు, ఫెన్సింగ్‌కు పరిహారం చెల్లించే ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న చర్చ జరుగుతోంది. 2021లో ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా నేటికీ కొందరు రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందకపోగా.. ఇంకొందరికి మాత్రం అధికంగా అందిందనే విమర్శలు వస్తున్నాయి. కొందరు రైతుల భూముల్లో బావులు, పైపులు, చెట్లు లేకపోయినా పరిహారం జాబితాలో చేర్చారని, అర్హుల పేర్లను మాత్రం విస్మరించారని.. అధికారులు చేతివాటం చూపడంతో ఇలా జరిగిందని రైతులు మండిపడుతున్నారు. కాగా, నష్టపరిహారానికి రైతుల ఎంపికలో ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, అటవీ, ఉద్యాన, ఎకై ్సజ్‌ శాఖ అధికారులు పాలుపంచుకున్నారు.

అధికారులకు ఫిర్యాదు చేసినా..

సీతారామ ప్రాజెక్టు కోసం ఏళ్ల క్రితమే భూములు సేకరించి రైతులకు పరిహారం చెల్లించారు. అయితే, ఆయా భూముల్లోని బావులు, బోర్లు, పైపులు, చెట్లు, ఫెన్సింగ్‌ తదితర ఆస్తులకు సంబంధించిన పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఖమ్మం కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించడం లేదని రైతులు వాపోతున్నారు. మండలంలోని అజ్మీరా తండా పరిధి రాకాసితండాకు చెందిన కలువాల యాకయ్య, బానోతు రవి భూముల్లోని పైపులు, చెట్లు కోల్పోగా రవి పేరిట ఎక్కువ పరిహారంతో అవార్డు చేసినట్లు తెలిసింది. దీంతో యాకయ్య తనకు రావాల్సిన పరిహారం మరో ఖాతా పేరిట నమోదైందని కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇటీవల కొందరికి పరిహారం విడుదలైనా రవి పేరిట జమ కాలేదు. దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. పరిహారం అక్రమాలు జరగడమే కాక అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో రైతుల మధ్య వివాదాలు ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఈ విషయమై ప్రశ్నిస్తే రైతులే తేల్చుకోవాలని అధికారులు సూచిస్తున్నట్లు తెలిసింది. పరిహారం పంపిణీలో అక్రమాలు జరిగినప్పుడు ఆరోపణలు వస్తున్నందున క్షేత్రస్థాయి సర్వే వివరాలు, పరిహారం చెల్లింపులపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

మండలంలోని తిప్పారెడ్డిగూడెంకు ఓ రైతుకు చెందిన ఒకే వ్యవసాయ బావికి ముగ్గురు కుటుంబ సభ్యుల పేర్లపై పరిహారం చెల్లించేందుకు అధికారులు అవార్డు సిద్ధం చేశారని తెలిసింది. స్థానికుడైన ఓ రైతు సమాచార హక్కు చట్టం ద్వారా అవార్డు కాపీ సేకరించగా ఈ విషయం వెలుగుచూసింది. సదరు రైతుకు ఒకే బావి ఉండగా ముగ్గురు కుటుంబ సభ్యుల పేరిట సుమారు రూ.26లక్షలకు పైగా అవార్డు అయి ఉండడం విస్మయాన్ని కలిగిస్తుంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితే పరిహారం పంపిణీలో మరిన్ని అక్రమాలు బయటపడతాయని చెబుతున్నారు.

ప్రాజెక్టు పరిహారంలో అక్రమాల పరంపర

నా వ్యవసాయ బావి, పైపులు కోల్పోయినా పరిహారం రాలేదు. 2021 నాటి అవార్డు కాపీలో పేరు ఉన్నప్పటికీ సవరించిన కాపీలో లేదు. కాల్వ తవ్వకం సమయాన మట్టి, రాళ్లు వేయడంతో బావి మొత్తం పూడిపోతుంది. అధికారులు న్యాయం చేయాలి.

– బానోతు మోహన్‌, రాకాసితండా

కాల్వ కింద భూమి పోగా మూడు కుంటల భూమి, బావి మిగిలింది. అప్పటి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తే పరిశీలించాలని అధికారులకు చెప్పారు. కానీ మొదట అవార్డు ప్రకారం పరిహారం ఇవ్వాలని నిర్ణయించి, ఆ తర్వాత రీసర్వే పేరుతో తొలగించారు.

– పోతుగంటి సహాదేవ్‌, రైతు, రాకాసితండా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement