క్యూఆర్‌ కోడ్‌.. నో స్కాన్‌! | - | Sakshi
Sakshi News home page

క్యూఆర్‌ కోడ్‌.. నో స్కాన్‌!

Nov 2 2026 12:17 AM | Updated on Nov 2 2026 12:17 AM

● పోలీసుల పనితీరు తెలుసుకునేందుకు ఠాణాల్లో ఏర్పాటు ● సేవలపై అభిప్రాయాలు డీజీ ఆఫీస్‌కు చేరేలా చర్యలు ● 10 నెలలవుతున్నా ప్రచారం లేకపోవడంతో వినియోగించని ఫిర్యాదుదారులు ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వాలి

● పోలీసుల పనితీరు తెలుసుకునేందుకు ఠాణాల్లో ఏర్పాటు ● సేవలపై అభిప్రాయాలు డీజీ ఆఫీస్‌కు చేరేలా చర్యలు ● 10 నెలలవుతున్నా ప్రచారం లేకపోవడంతో వినియోగించని ఫిర్యాదుదారులు

పాల్వంచరూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖ సేవలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేసినా ప్రజల నుంచి స్పందన లేదు. ప్రచారం చేయకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తుండగా, కోడ్‌ పోలీసు స్టేషన్‌ గోడలపై అలంకార ప్రాయంగా మారింది.

గత జనవరిలో ఏర్పాటు

పోలీసుల పనితీరును తెలుసుకునేందుకు గతేడాది జనవరి 15న ప్రభుత్వం ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేసింది. ఫిర్యాదులు చేసిన అనంతరం స్టేషన్‌లో ఉన్న క్యూర్‌ కోడ్‌ను మొబైల్‌ ఫోన్‌తో స్కాన్‌చేసి పోలీసుల పనితీరుపై ఫిర్యాదు దారుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఎఫ్‌ఐఆర్‌, ఫిర్యాదు, ఈ–చలాన్‌, పాస్‌పోర్టు వంటి తదితర అంశాలపై పోలీసుల అందిస్తున్న సేవలు, పనితీరుపై ప్రజలు తెలిపే అభిప్రాయం డీజీ ఆఫీసుకు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఫిర్యాదుదారులు ఎవరూ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో ప్రభుత్వం ఆశించినట్లు ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ రావడంలేదు.

ప్రచారలోపంతో...

ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా ఉన్నతాధికారులు ఆ స్టేషన్‌ పోలీసులకు ర్యాంక్‌లు ఇవ్వడంతోపాటు లోపాలపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రచారలోపం కారణంగా ఎవరూ క్యూఆర్‌ కోడ్‌ను వినియోగించడంలేదు. కోడ్‌ను బహిరంగ ప్రదేశాల్లో, ఇతర ప్రభుత్వశాఖల కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేయాలని పలువురు పేర్కొంటున్నారు. ప్రజల్లో విస్తృతంగా ప్రచారం, అవగాహన కూడా కల్పించాల్సి ఉంది. అప్పుడే ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుంది.

క్యూఆర్‌కోడ్‌ను ప్రజలు నిర్భయంగా వినియోగించుకోవాలి. ఫిర్యాదుదారులు స్టేషన్‌లో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌చేసి ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తే నేరుగా డీజీ కార్యాలయానికి సమాచారం చేరుతుంది. అప్పుడే పోలీసుల పనితీరు తెలుస్తుంది. క్యూఆర్‌కోడ్‌ ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ ఇచ్చిన ఫిర్యాదుదారుల పేర్లు రహస్యంగా ఉంచుతాం. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.

–సతీష్‌కుమార్‌, పాల్వంచ డీఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement