హాస్టళ్లు రెడీ.. | - | Sakshi
Sakshi News home page

హాస్టళ్లు రెడీ..

Nov 2 2026 12:17 AM | Updated on Nov 2 2026 12:17 AM

పనులు తుది దశకు..

తుది దశకు చేరిన మెడికల్‌ కళాశాల వసతి సముదాయ నిర్మాణం రూ.174 కోట్లతో చేపట్టిన పనులు డిసెంబర్‌లోగా పూర్తయ్యే అవకాశం ప్రైవేటు హాస్టళ్లలో ఉంటున్న 600 మంది వైద్య విద్యార్థులకు ఊరట

చుంచుపల్లి: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ విద్యార్థులకు హాస్టల్‌ వసతి ఇక్కట్లు తప్పనున్నాయి. బాయ్స్‌, గర్ల్స్‌ హాస్టళ్ల భవనాల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సుమారు రూ.174 కోట్లతో చేపట్టిన పనులు డిసెంబర్‌ నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల కలెక్టర్‌ అంకిత్‌ హాస్టల్‌ భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో నిర్దేశిత గడువులోగా హాస్టళ్లను సిద్ధం చేసేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు దృష్టి సారించారు. భవనాల నిర్మాణాలు దాదాపు పూర్తికావడంతో ఫినిషింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. వీటితోపాటు తాగునీటి పైపులైన్లు, విద్యుత్‌ సౌకర్యం, పారిశుద్ధ్యం భద్రత తదితర మౌలిక వసతులను సిద్ధం చేయాల్సి ఉంది.

జనవరిలో అందుబాటులోకి..

హాస్టళ్లు ప్రారంభమైతే దూర ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులకు ఊరట లభించనుంది. ప్రైవేటు హాస్టళలో ఉండే అవసరం తగ్గడంతోపాటు కళాశాల, ఆస్పత్రి, నివాస ప్రాంతాల మధ్య రాకపోకల ఇబ్బందులు కూడా తగ్గనున్నాయి. విద్యార్థుల సమయం ఆదా కావడంతో చదువు, వైద్య శిక్షణపై మరింత దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుంది. అధికారులు నిర్దేశించుకున్న గడువు మేరకు పనులు పూర్తయితే వచ్చే ఏడాది జనవరిలో 600 మంది విద్యార్థులకు హాస్టల్‌ వసతి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మెడికల్‌ కాలేజీ బాయ్స్‌, గర్ల్స్‌ హాస్టళ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మిగిలిన పనులతోపాటు తాగునీరు, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాం. డిసెంబర్‌ చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జనవరిలో విద్యార్థులకు హాస్టల్‌ వసతి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం.

–చక్రధర్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement