సత్వర పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

సత్వర పరిష్కారం చూపాలి

Oct 27 2026 12:26 AM | Updated on Oct 27 2026 12:26 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజల నుంచి స్వీకరించే ప్రతీ వినతిని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యా చందనతో కలిసి కలెక్టర్‌ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

దరఖాస్తుల్లో కొన్ని ఇలా..

● జాతీయ రహదారి నుంచి రామవరం మాతా, శిశు ఆస్పత్రి వరకు రోడ్డు కిరువైపులా పెరిగిన పిచ్చిచెట్లను తొలగించాలని రామవరం పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ఎండీ ముస్తాఫా దరఖాస్తు చేశారు. రాత్రి వేళల్లో పేషెంట్లు, సహాయకులు వెళ్లాలంటే భయపడుతున్నారని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. జాతీయ రహదారిపై యూ టర్న్‌ ఏర్పాటు చేయాలని, రామవరం–త్రీ ఇంక్లైన్‌ మధ్య ఉన్న శ్మశానవాటిక వద్ద ఉన్న బోరు పంపునకు మరమ్మతులు చేయాలని విన్నవించారు.

● చుంచుపల్లి మండలం బాబుక్యాంపు వైకుంఠధామంలో చెత్త డంపింగ్‌ చేసి తగలబెడుతున్నారని, దట్టమైన పొగ వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని స్థానిక యువత దరఖాస్తు చేయగా ఎంపీడీఓకు ఎండార్స్‌ చేశారు.

పట్టభద్రులు ఓటరుగా నమోదు కావాలి

అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవా లని కలెక్టర్‌ అంకిత్‌ సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాలోని వివిధ కళాశాలల ప్రిన్సి పాళ్లతో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై నిర్వహించిన సమావేశంలో మాటాల్డారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు అందలేదని అన్నా రు. అర్హులైన ప్రతీ పట్టభద్రుడు ఓటరుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫారం–18 దరఖాస్తులను నవంబర్‌ 6వ తేదీ లోగా సమర్పించాలన్నారు. ప్రతీ కళాశాలలో నోడల్‌ అధికారిని నియమించి ఎన్నికల విభా గంతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. కళాశాలల్లోని బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది, ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థుల వివరాలను సేకరించాలని చెప్పారు. ఎన్నికల సూపరింటెండెంట్‌ రంగ ప్రసాద్‌, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రతినిధులు, ఎన్ని కల విభాగం సిబ్బంది నవీన్‌, అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో వాల్మీకి మహర్షి జయంతి

జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలునిర్వహించారు. కలెక్టర్‌ అంకిత్‌ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అధికారులు విద్యా చందన, జయలక్ష్మి, శ్రీలత, బీసీ సంఘాల నాయకులు నందకిషోర్‌, సాంబయ్య, శ్రీని వాసు, రాంబాబు, బి శ్రీనివాస్‌, మాధురి, జయశ్రీ, గుమలాపురం సత్యనారాయణ, డి.సత్యనారాయణ, రమేష్‌, జయమ్మ పాల్గొన్నారు.

విద్యార్థుల సామర్థ్యాల పెంపుపై శ్రద్ధ చూపాలి

జూలూరుపాడు(సుజాతనగర్‌): విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపుపై శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. సోమవారం సుజాతనగర్‌ ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యాబోధన, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. కొందరు విద్యార్థులు వెనుకబడి ఉండటాన్ని గమనించిన కలెక్టర్‌ తగిన శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. తహసీల్దార్‌ కృష్ణ ప్రసాద్‌, హెచ్‌ఎం రామ్మూర్తి పాల్గొన్నారు.

ప్రజావాణిలో కలెక్టర్‌ అంకిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement