పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిని జర్మనీకి చెందిన 18 మంది టూరిస్టులు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కిన్నెరసాని డీర్‌పార్కులో దుప్పులు, డ్యామ్ పైనుంచి జలాశయం, పర్యావరణ కేంద్రాన్ని వీక్షించారు. విదేశీ టూరిస్టులకు కిన్నెరసానిలోని ప్రకృతి అందాలు, వన్యప్రాణి సంరక్షణ యాజమాన్య పద్ధతులను వైల్డ్‌లైఫ్ సెక్షన్ ఆఫీసర్ కిషన్, ఎఫ్‌బీఓ నాగేశ్వరరావు వివరించారు. ఈ సందర్భంగా కిన్నెరసాని అందంగా ఉందంటూ పర్యాటకులు ఫొటోలు దిగుతూ సందడి చేశారు.
సందర్శించిన జర్మనీ పర్యాటకులు


