గ్యాస్‌ గోదాం మేనేజర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ గోదాం మేనేజర్‌ ఆత్మహత్య

Oct 18 2026 12:18 AM | Updated on Oct 18 2026 12:18 AM

భద్రాచలంఅర్బన్‌: పట్టణంలోని ఓ లాడ్జిలో గ్యాస్‌ గోదాం మేనేజర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన శని వారం వెలుగుచూసింది. పాల్వంచ గ్యాస్‌ గోదాం మేనేజర్‌గా పని చేస్తున్న అనంతుల లక్ష్మీనారాయణ(56) పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఉన్న గోదా వరి లాడ్జిలో ఉరివేసుకున్నాడు. వివరాలు ఇలా.. లక్ష్మీనారాయణపై సుమారు నెల రోజుల క్రితం ఓ మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో శనివారం లక్ష్మీనారాయణ తాను పనిచేస్తున్న కార్యాలయ వాట్సాప్‌ గ్రూపులో సూసైడ్‌ నోట్‌ పోస్టు చేశారు. గమనించిన తోటి ఉద్యోగులు ఆయన ఆచూకీ కోసం గాలించగా, గోదావరి లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జికి చేరుకునేసరికి ఉరి వేసుకుని ఉన్నాడు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. కాగా, సూసైడ్‌ నోట్‌లో తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను లక్ష్మీనారాయణ ఖండించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపిస్తూ ముగ్గురు విలేకర్ల (సాక్షి కాదు)తో పాటు మరో ముగ్గురి పేర్లను అందులో ప్రస్తావించారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓ కూతురికి వివాహమైంది.

అమ్మను జాగ్రత్తగా చూసుకోండి

ఉరివేసుకునే ముందు పెద్ద కూతురుకు లక్ష్మీనారాయణ వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టాడు. ‘ మీ ఇద్దరు అమ్మను జాగ్రత్తగా చూసుకోండి, అమ్మ బాధ్యతను మీ చేతుల్లో పెడుతున్నాను., మీకు కొడుకుగా పుడతాను, నన్ను క్షమించండి’ అని పేర్కొన్నాడు. ఫిర్యాదు వాపసు తీసుకునేందుకు రూ. కోటి అడుగుతున్నట్లు కలీం చెప్పాడని మెసేజ్‌లో తెలిపాడు.

సూసైడ్‌ నోట్‌లో ముగ్గురు విలేకర్లతోపాటు మరో ముగ్గురి పేర్లు ప్రస్తావన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement