ఘనంగా రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా రామయ్య కల్యాణం

Oct 3 2026 12:20 AM | Updated on Oct 3 2026 12:20 AM

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి నిత్యకల్యాణం వైభవోపేతంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో కల్యాణ మూర్తులను కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

శాశ్వత నిత్యాన్నదానానికి భారీ విరాళం

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి పలువురు భక్తులు శుక్రవారం విరాళాలను అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన సోదరులు ఏ.ఆనందరావు, షణ్ముఖరావు, యుగంధర్‌ తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అన్నదానానికి రూ.2,50,000, ఆలయ అభివృద్ధికి రూ.50 వేలను ఆలయ అధికారులకు అందజేశారు. హైదరాబాద్‌కే చెందిన శాగంటి సహదేవ్‌ నిత్యాన్నదాన నిమిత్తం రూ. లక్ష ఆలయ అధికారులకు విరాళంగా ఇచ్చారు. దీంతో దాతలకు ఈఓ దామోదర్‌ రావు రశీదును అందజేశారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లికి

పంచామృతాభిషేకం

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచ హారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలు, కుంకుమ పూజ, గణపతిహోమం జరిపించారు.

రేపు ఫుట్‌బాల్‌

జట్టు ఎంపికలు

ఖమ్మం అర్బన్‌: ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్‌–17 బాలుర ఫుట్‌బాల్‌ జట్టును ఈనెల 4న ఎంపిక చేయనున్నారు. ఈ ఎంపిక పోటీలు ఖమ్మం కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న సెడార్‌ వాలీ పాఠశాలలో జరుగుతాయని ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బియ్యని కృష్ణయ్య, ఎస్‌జీఎఫ్‌ బాధ్యులు బి.బావ్‌సింగ్‌, వై.చిన్ని, కె.ఆదర్శ్‌కుమార్‌ తెలిపారు. 2010 జనవరి 1 తర్వాత జన్మించి, ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న వారు స్టడీ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, ఇంటర్‌ విద్యార్థులైతే ఎస్సెస్సీ మెమోతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 99492 93600 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement