గోండి కోయ భాష మూలాలను గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

గోండి కోయ భాష మూలాలను గుర్తించాలి

Oct 3 2026 12:20 AM | Updated on Oct 3 2026 12:20 AM

భద్రాచలం ఎమ్మెల్యే, ఐటీడీఏ పీఓ

భద్రాచలం: ప్రాచీన కాలంలోని గోండి కోయ భాష పదాల ములాలను గుర్తించి, ప్రాచుర్యంలోకి తీసుకురావాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్‌ అన్నారు. శుక్రవారం గిరిజన భవనంలో జరిగిన గోండి–కోయ నిఘంటువు వర్క్‌ షాప్‌ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. గిరిజన భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన గోండి– కోయ గోత్రాల జెండాకు పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. అనంతరం ఆదివాసీ మహనీయుల చిత్రపటాల వదద్ద శ్రద్ధాంజలి ఘటించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ 12 రాష్ట్రాల్లో ఉన్న గిరిజన తెగలు అందరూ ఒక తాటిపై నడిస్తే తప్పనిసరిగా గోండి భాషకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఐటీడీఏ పీఓ మాట్లాడుతూ ఆదిమ జాతుల భాషా సంస్కృతులు సరైన గుర్తింపు, గౌరవం లేని కారణంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని అన్నారు. అందరూ కోయ భాషలోనే మాట్లాడే విధంగా ప్రయత్నం చేయాలని సూచించారు. అనంతరం కోయ భాషలో తన ప్రసంగాన్ని, సందేశాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఆదివాసీ చిన్నారుల నృత్య ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పూనెం కృష్ణ, అధికారులు డేవిడ్‌ రాజ్‌, రాధమ్మ, రమణయ్య, నెహ్రూ, తొమ్మిది రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

గాంధీజీకి నివాళి

భద్రాచలం: ఐటీడీఏ సమావేశం మందిరంలో మహాత్మా గాంధీ జయంతి నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా పీఓ రాహుల్‌ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. భద్రాచలంలోని సబ్‌ కలెక్టరేట్‌లో సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ తదితరులు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్టీఓ కార్యాలయంలో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ సంగం వెంకట పుల్లయ్య తదితరులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో డేవిడ్‌ రాజ్‌, మధుకర్‌, అలివేలు మంగతాయారు, ప్రభాకర్‌ రావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement