సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలు, తహసీల్దార్లతో ఎస్‌ఐఆర్‌పై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న నోటీసుల డెలివరీ, పత్రాల సేకరణ, ఫామ్–6, 7, 8 దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో 5,858 నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, ఐదు రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న 132 నోటీసులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. భద్రాచలంలో 1,260, పాల్వంచలో 872, మణుగూరులో 716, పినపాక పరిధిలో 804, అశ్వారావుపేటలో 504 నోటీసులు పెండింగ్‌లో ఉన్నందున, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి డెలివరీ పూర్తి చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
జాతిపిత గాంధీజీకి ఘన నివాళి
జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని కలెక్టర్ సూచించారు. అధికారులు విద్యా చందన, సునీత, అనంత రామకృష్ణ, అనూష, శ్రీనివాస్, పరంధామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


