హక్కుల కోసం జర్నలిస్టుల ఆందోళనలు | - | Sakshi
Sakshi News home page

హక్కుల కోసం జర్నలిస్టుల ఆందోళనలు

Oct 3 2026 12:20 AM | Updated on Oct 3 2026 12:20 AM

టీయుడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో...

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, వృత్తిపరమైన భద్రత కోసం తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు(టీయుడబ్ల్యూజే–ఐజేయు) ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌లో ఆందోళన నిర్వహించారు. మొదట కొత్తగూడెంలోని అంబేద్క ర్‌ విగ్రహానికి, గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేసి నిరసన తెలిపారు. బస్టాండ్‌ సెంటర్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పి ంచారు. అనంతరం మోటారు సైకిల్‌ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపా రు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జర్నలిస్టులు అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘీభావం తెలిపినవారిలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా, మేయర్‌ మూడ్‌ గణేష్‌, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ నాగ సీతారాములు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్ర భాకర్‌రెడ్డి, జేబీపీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఝెర్రా కామేష్‌, బీఆర్‌ఎస్‌ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు రాజుగౌడ్‌, మాస్‌ లైన్‌ నాయకుడు ముద్ధా భిక్షం, కొత్తగూడెం సొసైటీ చైర్మన్‌ మండే వీరహనుమంతరావు ఉన్నా రు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్య క్ష కార్యదర్శులు జాగు వెంకటరత్నం, జునుమాల రమేష్‌, జిల్లా ఎలక్ట్రానిక్‌ మీడియా అధ్యక్ష కార్యదర్శులు నవీన్‌, నాగచంద్ర, కోశాధికారి రాజేష్‌, దుద్దుకూరు రామారావు, అబ్బురామ్‌, వందా సత్యానంద్‌, శంకర్‌, చంద్రశేఖర్‌, జి.భద్రం, నక్క శ్యామ్సన్‌, బర్ల జోషి పాల్గొన్నారు.

టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్‌) ఆధ్వర్యంలో

కొత్తగూడెంఅర్బన్‌: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఆంక్షలు లేకుండా హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని, ఉద్యోగులకు సమానంగా నా ణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరుతూ శుక్రవారం జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్‌) ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమ కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఒకవైపు చెబుతూనే సమస్యలు పరిష్కరించకుండా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ప్రతీ జర్నలిస్టుకు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇకనైనా ముఖ్యమంత్రి కళ్లు తెరవాలని డిమాండ్‌ చేస్తూ గాంధీజయంతి సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించినట్లు తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కల్లోజు శ్రీనివాస్‌, టెంచుజిల్లా అధ్యక్షుడు మట్టికొండ రవి, సహాయ కార్యదర్శి కాగితపు వెంకటేశ్వరరావు, సాక్షి బ్యూరో కృష్ణగోవింద్‌, మోటమర్రి రామకృష్ణ, సీమకుర్తి రామకృష్ణ, ప్రభాకర్‌ రెడ్డి, చావా పాపారావు, శేఖర్‌, కృష్ణారావు, రమేష్‌, రమణ, తారక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement