క్రీడా మైదాన డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

క్రీడా మైదాన డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నాం

Oct 3 2026 12:20 AM | Updated on Oct 3 2026 12:20 AM

ఎమ్మెల్యే కూనంనేని

రుద్రంపూర్‌: కొత్తగూడెంలో 18 ఎకరాల స్థలంలో క్రీడా మైదానం ఏర్పాటుకు డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ నెల 4న ప్రకాశం స్టేడియంలో జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహించనుండగా, శుక్రవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ క్రీడాకారులు పోటీల్లో పాల్గొ ని సత్తా చాటాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్‌ అసోషియేషన్‌ కార్యదర్శి కే. సారంగపాణి మాట్లాడుతూ కొత్తగూడెంలో 400 మీటర్ల సింథటిక్‌ అద్లెటిక్స్‌ రన్నింగ్‌ ట్రాక్‌ నిర్మించాలని కోరారు. జిల్లా అథ్లెటిక్స్‌ అసోషియేషన్‌ కార్యదర్శి కే.మహిధర్‌, కోచ్‌ డి. మల్లిఖార్జున్‌రావు, పి. నాగేందర్‌, జాతీయ క్రీడాకారులు సక్‌ రియాజ్‌పాషా, వేదశ్రీ, మధుప్రియలు పాల్గొన్నారు.

అటవీ కార్యాలయం వద్ద అడవి దున్న..

చుంచుపల్లి: జిల్లా అటవీశాఖ కార్యాలయం సమీపంలో శుక్రవారం అడవి దున్న (బైసన్‌) సంచారం కనిపించింది. ప్రధాన రహదారి, పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో వాహనదారులు ఆసక్తిగా తిలకించారు. తరుచూ దున్నలు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. దున్నకు సమీపంగా వెళ్లడం, వెంబడించడం, చుట్టుముట్టడం, ఆహారం అందించడం, రెచ్చగొట్టడం వంటివి చేయరాదని సూచించారు. దగ్గరగా వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.

వరకట్న వేధింపుల

కేసు నమోదు

జూలూరుపాడు(సుజాతనగర్‌): మహిళను అదనపు కట్నంకోసం వేధిస్తున్న భర్త, అతని కుటుంబసభ్యులపై పోలీసులు శుక్రవారం కేసు నమోదుచేశారు. సుజాతనగర్‌ ఎస్‌ఐ కల్యాణి కథనం ప్రకారం.. మూడేళ్ల క్రితం సుజాతనగర్‌ మండలం జామ్లాతండాకు చెందిన బానోత్‌ భోజ్యా, గోబి దంపతుల కుమార్తె సుజాతకు మహబాబాబాద్‌ జిల్లా కురవి మండలం పెద్దతండాకు చెందిన గుగులోత్‌ అశోక్‌ కుమార్‌తో వివాహం జరిగింది. అశోక్‌ కుమార్‌, సుజాత దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. పెళ్లి సమయంలో వరకట్నం కింద బంగారం, వ్యవసాయ భూమి ఇచ్చినా కొంతకాలంగా అదనపు కట్నం కోసం భర్తతోపాటు అత్త కాంతి, మామ శంకర్‌, ఆడబిడ్డ రాజేశ్వరి వేధిస్తున్నారు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసినా మార్పు రాలేదు. దీంతో వేధింపుల తాళలేక సుజాత పుట్టింటికి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement