బూర్గంపాడు: మండలంలోని జింకలగూడెం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాల్వంచ డీఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. అనుమానితులు, అసాంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు. సరైన పత్రాలు లేని 40 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా గంజాయి సేవించడం, రవాణా చేయడం, పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. సీఐ సతీష్, ఎస్సైలు ప్రసాద్, నాగ భిక్షం, రామ్మూర్తి, నాగరాజు, విజయ, సురేష్, మధు ప్రసాద్, డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.
40 వాహనాలు సీజ్


