మిగిలింది రెండు రోజులే.. | - | Sakshi
Sakshi News home page

మిగిలింది రెండు రోజులే..

Aug 29 2026 12:58 AM | Updated on Aug 29 2026 12:58 AM

● కొత్త పింఛన్లపై చిగురిస్తున్న ఆశలు ● ‘చేయూత’కు ఇప్పటికే 11,641 అర్జీలు

చేయూత దరఖాస్తుల వివరాలు..

● కొత్త పింఛన్లపై చిగురిస్తున్న ఆశలు ● ‘చేయూత’కు ఇప్పటికే 11,641 అర్జీలు

చుంచుపల్లి: ఆపన్నులకు అండగా నిలిచే చేయూత పథకంపై ఆశలు చిగురిస్తున్నాయి. అర్హత ఉన్న తమకు పింఛన్‌ మంజూరవుతుందనే నమ్మకంతో పెద్ద సంఖ్యలో ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈనెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకాగా, ఈనెల 31తో గడువు ముగియనుంది. ఇప్పటికే దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రాగా, మిగిలిన రెండు రోజుల్లో మరిన్ని దరఖాస్తులు నమోదయ్యే అవకాశం ఉంది. జిల్లాలో అందుతున్న దరఖాస్తులను అధికారులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి వృద్ధులు, బీడీ కార్మికులకు మినహాయింపు ఇచ్చి వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఫైలేరియా, తలసేమియా, సికిల్‌సెల్‌, హిమోఫీలియా, డయాలసిస్‌ బాధితులకే దరఖాస్తు అవకాశం కల్పించారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిశాక అర్హతల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశముంది.

గ్రామాల్లోనే అధికం

జిల్లాలో గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటివరకు 11,641 దరఖాస్తులు అందాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచే 8,931 దరఖాస్తులు రాగా, పట్టణ ప్రాంతాల నుంచి 2,710 దరఖాస్తులు నమోదయ్యాయి. అత్యధికంగా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 1,014, పాల్వంచలో 840, దమ్మపేటలో 728, ఇల్లెందులో 711, చర్లలో 700, టేకులపల్లిలో 646, భద్రాచలంలో 536 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా వితంతువులు 7,857 మంది, దివ్యాంగులు 3,069 మంది అర్జీలు సమర్పించారు. ఇప్పటివరకు చేనేత కార్మికులు నుంచి దరఖాస్తులు అందకపోగా, కల్లుగీత కార్మికుల కేటగిరీలో 34 దరఖాస్తులు నమోదయ్యాయి. దరఖాస్తులను సెప్టెంబరు 1 నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితా ఖరారు చేసే అవకాశముంది. ఈ నివేదికలు తొలుత మండల, పురపాలక స్థాయిల్లో పరిశీలన అనంతరం కలెక్టర్‌ ద్వారా సెర్ప్‌ ప్రధాన కార్యాలయానికి చేరతాయి. అక్కడ సీఈఓ స్థాయిలో తుది పరిశీలన చేపట్టి ప్రభుత్వానికి జాబితా సమర్పిస్తారు.

మండలం అర్జీలు మండలం అర్జీలు

ఆళ్లపల్లి 124 లక్ష్మీదేవిపల్లి 248

అన్నపురెడ్డిపల్లి 295 మణుగూరు 368

అశ్వాపురం 369 పాల్వంచ 353

అశ్వారావుపేట 456 పినపాక 356

భద్రాచలం 536 సుజాతనగర్‌ 188

బూర్గంపాడు 552 టేకులపల్లి 646

చండ్రుగొండ 396 ఇల్లెందు 711

చర్ల 700 దుమ్ముగూడెం 492

చుంచుపల్లి 438 కొత్తగూడెం కార్పొరేషన్‌ 1,014

దమ్మపేట 728 పాల్వంచ 840

గుండాల 200 ఇల్లెందు మున్సిపాలిటీ 353

జూలూరుపాడు 294 మణుగూరు మున్సిపాలిటీ 304

కరకగూడెం 187 అశ్వారావుపేట మున్సిపాలిటీ 199

ములకలపల్లి 294

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement