ఇల్లెందు: రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్ తదితర కొన్ని ప్రధాన రూట్లలో శుక్రవారం ఆర్టీసీ బస్సులకు డిమాండ్ తగ్గింది. ఇదే సమయాన అంతర్ జిల్లా పరిధిలో రూట్లలో మాత్రం రద్దీ నెలకొంది. ఈక్రమాన అధికారులు అదనపు సర్వీసులు ఏర్పాటుచేశారు. వీటికి ‘స్పెషల్ సర్వీస్’ అని బోర్డు అంటించడమే కాక టికెట్ చార్జీలు కూడా అమాంతం పెంచారు. ఇల్లెందు నుంచి ఖమ్మంకు ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రస్తుతం టికెట్ ధర రూ.80గా ఉంది. కానీ స్పెషల్ బస్సులో ఏకంగా రూ.30 పెంచి ఒక్కొక్కరి నుంచి రూ.110 వసూలు చేశారు. ఈక్రమాన శుక్రవారం ఇల్లెందు నుంచి ఖమ్మం వెళ్లిన ప్రయాణికుడు రవి బస్టాండ్‌లో నిరసన వ్యక్తం చేశాడు. అదనపు చార్జీల విషయమై ఆర్టీసీ అధికారులను ప్రశ్నిస్తే కనీసం సమాధానం కూడా చెప్పడం లేదని వాపోయాడు.
రూ.80 టికెట్‌పై ఏకంగా రూ.30 పెంపు


