పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. 2026 మార్చి 21వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు నాలుగు నెలల పది రోజులకు హుండీ కానుకలను లెక్కించగా రూ.38,98,378 ఆదాయం లభించింది. అమెరికా డాలర్ నోట్లు 3, యూఏఈ 10 ధీరమ్స్, మిశ్రమ వెండి, బంగారం లభించగా వాటిని సీజ్‌చేసి తిరిగి హుండీలో వేశారు. దేవాదాయశాఖ కొత్తగూడెం డివిజన్ పరిశీలకుడు కె.ఆనంద్, ఈఓ విజయ్‌కుమార్ పర్యవేక్షించారు.
సువర్ణ పుష్పార్చన
శ్రీ వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు జరిపారు.


