అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం

Jul 31 2026 12:39 AM | Updated on Jul 31 2026 12:39 AM

ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): తెలంగాణ సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, కలెక్టర్‌ అంకిత్‌తో కలిసి గుంపెన, నర్సాపురం, బీమునిగూడెం, కొండాయిగూడెం, పెద్దిగూడెం తదితర గ్రామాల్లో పర్యటించారు. రూ 2.77 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ పథకం ద్వారా పేదల సొంతింటి కల నిజం చేస్తామన్నారు. సీతారామ ప్రాజెక్ట్‌ భూ నిర్వాసితుల సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ రోహిత్‌రాజు, డీపీఓ అనూష, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, కొత్తగూడెం ఆర్డీఓ మధు, తహసీల్దార్‌ స్వర్ణ, ఎంపీడీఓ రాజేశ్వరి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పర్సా వెంకటేశ్వరరావు, రమణ, శివ, నరేష్‌, లక్ష్మారెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement