మామిడి.. మాకొద్దు.. | - | Sakshi
Sakshi News home page

మామిడి.. మాకొద్దు..

Feb 24 2026 7:16 AM | Updated on Feb 24 2026 7:16 AM

మామిడ

మామిడి.. మాకొద్దు..

● పూత నిలవక, పిందె రాక రైతుల ఆవేదన ● ఫలితంగా సీజన్‌ సమయంలో చెట్ల తొలగింపు ● లేత మామిడి తోటల్లో మాత్రం ఆశాజనకమే..

కొన్నేళ్లుగా నష్టాలే..

కాయను కాపాడుతున్నాం..

● పూత నిలవక, పిందె రాక రైతుల ఆవేదన ● ఫలితంగా సీజన్‌ సమయంలో చెట్ల తొలగింపు ● లేత మామిడి తోటల్లో మాత్రం ఆశాజనకమే..

వేంసూరు: జిల్లాలో మేలైన రకాల మామిడి తోటలకు చిరునామాగా నిలిచిన వేంసూరు మండలంలో ఇప్పుడు గతమెంతో ఘన చరిత్ర అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు కళకళలాడిన మామిడి తోటలపై పెట్టుబడి తప్ప ఆదాయం రాకపోవడంతో రైతులు నెమ్మదిగా తమ మార్గం మార్చుకుంటున్నారు. ముదురు మామిడి తోటలపై ఎంత పెట్టుబడి పెట్టినా, ఎన్ని మందులు పిచికారీ చేసినా పూత నిలవక, నిలిచినా పిందె రాకపోవడంతో సీజన్‌ సమయంలోనే మామిడి చెట్లను తెగ నరుకుతున్నారు. ఫలితంగా వేంసూరు మండలంలో 25 వేలుగా ఉన్న మామిడి తోటల విస్తీర్ణం నేడు ఐదు వేల ఎకరాలకు పడిపోగా.. మరింత తగ్గే అవకాశముందని చెబుతున్నారు.

పెట్టుబడి భారం

గత ఐదేళ్లుగా రకరకాల కారణాలతో మామడి రైతులకు నష్టాలే తప్ప లాభాలు రావడం లేదు. దీంతో చాలా మంది పంటపై అనాసక్తి చూపుతున్నారు. వాతావరణ మార్పులు, తెగుళ్లు, పిందె దశలో కాయకుళ్లు తెగులు, ఆశిస్తుండడం.. ఇవన్నీ దాటినా ప్రకృతి వైపరీత్యాలతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. ఇవన్నీ అధిగమిస్తే పంటకు ఉత్తరాది వ్యాపారులే ధర నిర్ణయిస్తుండడంతో కనీస పెట్టుబడి కూడా రాక మామిడి తోటలు తొలగించి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.

లేత తోటల్లో పర్వాలేదు..

వేంసూరు మండంలో ముదురు మామిడి తోటలు తొలగించిన రైతుల్లో పలువురు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే, ఇంకొందరు మాత్రం మళ్లీ మామిడే నాటడంతో ఆ లేత తోటల్లో దిగుబడి ఆశాజనకంగా ఉంటోంది. దీంతో లేత తోటల్లో పండ్లను కాపాడుకునేందుకు కవర్లు ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

వరుస ఐదేళ్ల నుంచి మామిడికి పెట్టుబడి తప్ప లాభాలు రావడంలేదు. ఈ నష్టాలతో తోట తొలగించే పరిస్థితి ఎదురవుతోంది. కాపు సమయాన కష్టాలు ఓర్చుకున్నా మార్కెట్‌లో సరైన ధర దక్కక ప్రత్యామ్నయ పంటల వైపు చూస్తున్నా.

– దొడ్డ చెన్నకేశవరెడ్డి, రైతు, అడసర్లపాడు

ముదురు మామిడి తోట తొలగించి కొన్నాళ్ల క్రితం మళ్లీ మొక్కలు నాటాం. ఇలాంటి లేత మామిడి తోటల్లో కాపు ఆశాజనకంగా ఉంటోంది. దీంతో కాాయను కాపాడుతూ, మంచి ధర వచ్చేలా నాణ్యత కోసం కవర్లు ఏర్పాటు చేస్తున్నాం.ఽ

– బండి శ్రీనివాసరెడ్డి, రైతు, కల్లూరుగూడెం

మామిడి.. మాకొద్దు..1
1/3

మామిడి.. మాకొద్దు..

మామిడి.. మాకొద్దు..2
2/3

మామిడి.. మాకొద్దు..

మామిడి.. మాకొద్దు..3
3/3

మామిడి.. మాకొద్దు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement