ఆర్టీసీ బస్సులకు మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులకు మరమ్మతులు

Feb 24 2026 7:16 AM | Updated on Feb 24 2026 7:16 AM

ఆర్టీసీ బస్సులకు మరమ్మతులు

ఆర్టీసీ బస్సులకు మరమ్మతులు

ఇల్లెందు: ఆర్టీసీ ఇల్లెందు డిపో బస్సులు పాతవి కావడంతో తరచూ మొరాయిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఇల్లెందు బస్టాండ్‌ నుంచి బయల్దేరిన షటిల్‌ సర్వీస్‌ టేకులపల్లి–ఇల్లెందు మధ్య 9వ మైలు తండా దాటాక మూలమలుపు వద్ద ఆగిపోయింది. బ్రేకులు ఫెయిల్‌ కావడంతో బస్సును నిలిపివేయాల్సి వచ్చింది. బస్సు కండీషన్‌లో లేదని డ్రైవర్‌ డిపోలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా ఒక్క ట్రిప్‌ వేయాలని సూచించడంతో గేర్లు పడని బస్సుతో డ్రైవర్‌ బయల్దేరాడు. సమస్య తీవ్రమై మధ్యలోనే నిలిచిపోయింది. అదే సమయంలో రెండు బస్సులు వచ్చినా అక్కడ నిలపకుండా వెళ్లడంతో కొందరు ప్రయాణికులు ఆటోలు, మ్యాజిక్‌లు, ఇతర వాహనాల్లో వెళ్లాల్సి వచ్చింది. మరికొందరు అక్కడే నిరీక్షించగా, గంట తర్వాత వచ్చిన బస్సులో కొత్తగూడెం వెళ్లారు. ఇల్లెందు డిపోలోని పాత బస్సులకు మరమ్మతులు చేపట్టాలని డ్రైవర్లు, ప్రయాణికులు కోరుతున్నారు.

తరచూ మొరాయిస్తున్న ఇల్లెందు డిపో సర్వీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement