అథ్లెటిక్స్ టోర్నీలో చాంపియన్‌గా ఖమ్మం
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు సోమవారం ముగిశాయి. పురుషుల విభాగంలో ఖమ్మం జిల్లా ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం చేసుకోగా, మహిళల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాంపియన్‌గా నిలిచింది. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి 1,518 మంది అథ్లెట్లు పాల్గొనగా, 32 ఈవెంట్లలో పోటీలు నిర్వహించినట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ అశోక్‌కుమార్ తెలిపారు. ముగింపు కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొని విజేతలకు మెమోంటోలు అందించారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్‌ఖాన్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు సారంగపాణి, వెంకటేశ్వర్‌రెడ్డి, గట్టు మహేష్‌బాబు, మహ్మద్ కరీం, రాజేందర్‌తో పాటు కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు.


