ఏడు గంటల ప్రయాణం.. | - | Sakshi
Sakshi News home page

ఏడు గంటల ప్రయాణం..

Feb 23 2026 7:08 AM | Updated on Feb 23 2026 7:08 AM

ఏడు గ

ఏడు గంటల ప్రయాణం..

ఏడు గంటల ప్రయాణం.. సమీపంలో ఏర్పాటు చేయాలి మరోసారి ఇలా జరగకుండా చూస్తాం ●

మాది మహబూబాబాద్‌ జిల్లా రోటిబండ గ్రామ పంచాయతీ దుద్యా తండా. నా కూతురికి దమ్మపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో కేంద్రం కేటాయించారు. తెల్లవారుజామున రెండు గంటలకు బయల్దేరి సుమారు 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించి దమ్మపేట చేరుకున్నాం. ఏడు గంటల సమయం పట్టింది.

–అంగోత్‌ బుజ్జి, మహబూబూబాద్‌ జిల్లా

మాది కరకగూడెం. మా పాపతోపాటు మా గ్రామానికి చెందిన మరికొందరు పిల్లలకు దమ్మపేటలో పరీక్ష కేంద్రం కేటాయించడంతో ఆటో మాట్లాడుకుని వచ్చాం. తెల్లవారుజామున నాలుగు గంటలకు బయల్దేరాం. దూర భారంతో పిల్లలు కూడా అలసిపోయారు. చార్జీలు కూడా ఎక్కువయ్యాయి.

–పోలేబోయిన సరస్వతి, కరకగూడెం

పరీక్ష కేంద్రాలు దూరంగా ఉండటంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ పరీక్షలను సాంఘిక సంక్షేమ గురుకులాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేసి, మరో మారు ఇలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటాం.

– అరుణ కుమారి, గిరిజన గురుకులాల ఆర్‌సీఓ

ఏడు గంటల ప్రయాణం.. 
1
1/1

ఏడు గంటల ప్రయాణం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement