నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

Feb 23 2026 7:08 AM | Updated on Feb 23 2026 7:08 AM

నేత్ర

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లికి

విశేష పూజలు

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్‌ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్‌.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్‌ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.

నవోదయ నిర్మాణ స్థలం పరిశీలన

అశ్వాపురం: మండల పరిధిలోని బీజీ కొత్తూరు గ్రామంలో నవోదయ పాఠశాల నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని ఎన్‌బీసీసీ నిర్మాణ సంస్థ బృందం ఆదివారం పరిశీలించింది. బీజీకొత్తూరు గ్రామంలో పాఠశాల నిర్మాణానికి 997 సర్వే నంబర్‌లో 33 ఎకరాల భూమిని గతంలో సేకరించి ప్రభుత్వానికి అప్పగించారు. రూ.80 కోట్లు అంచనా వ్యయంతో కేంద్రీయ విద్యాలయాల నిర్మాణంలో గుర్తింపు పొందిన ఎన్‌బీసీసీ సంస్థకు నవోదయ నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. దీంతో వారు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. నవోదయ పాఠశాలకు వరకు రహదారి పనులు జరుగుతున్నాయి. విద్యుత్‌, నీటి సదుపాయాలు ఏర్పాటు కాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

నిబంధనలు పాటించాలి

పాల్వంచ: ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ అన్నా రు. ఆదివారం పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించనివారికి నోటీసులు జారీ చేశారు. నిర్దిష్ట గడువు లోగా లోపాలు సరిదిద్దుకోవాలన్నారు. అనంతరం మాట్లాడుతూ రిసెప్షన్‌ కేంద్రం వద్ద, ఆస్పత్రి ముందుభాగంలో అన్ని వివరాలు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు.

నేత్రపర్వంగా  రామయ్య నిత్యకల్యాణం1
1/2

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

నేత్రపర్వంగా  రామయ్య నిత్యకల్యాణం2
2/2

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement