ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్‌

Aug 18 2025 6:31 AM | Updated on Aug 18 2025 6:31 AM

ఆరోగ్

ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్‌

ఆరోగ్య మిత్రల కొరతతో ఇబ్బందులు

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్య

సేవలకు అంతరాయం

ప్రారంభంలో 125 మంది ఉండగా, ప్రస్తుతం 68 మందితో

నెట్టుకొస్తున్న వైనం

సేవలకు దూరమవుతున్న

అర్హులైన రోగులు

ఇబ్బంది లేకుండా చూస్తున్నాం

ఖమ్మంవైద్యవిభాగం: గత వారం కోదాడకు చెందిన ఓ మహిళకు గుండె నొప్పి రావటంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె పరిస్థితి సీరియన్‌గా ఉండటంతో యాంజియోగ్రామ్‌ నిర్వహించి స్టంట్లు వేయాలని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు ఉండగా, కుటుంబ సభ్యులు వినియోగించుకోవా లని ప్రయత్నించారు. కానీ పేషంట్‌కు సీరియస్‌గా ఉందని, వెంటనే మూడు స్టంట్లు వేయాలని యా జమాన్యం తెలపడంతో ఆరోగ్యశ్రీ ద్వారా చేయా లని కోరారు. కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా రెండు స్టంట్లకే అవకాశం ఉంటుందని చెప్పటంతో చేసేది లేక హుటాహుటిన రూ.2లక్షలు చెల్లించి స్టంట్లు వేయించారు. కనీసం హైదరాబాద్‌ రిఫర్‌ చేసినా వారికి ఉచితంగా సేవలు లభించేవి. దీంతో వారు ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు ఆస్పత్రి యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు.

●ఇటీవల తల్లాడ మండలానికి చెందిన ఓ వ్యక్తికి రాత్రిపూట గుండె నొప్పి రావటంతో కుటుంబ సభ్యులు నగరంలోని వైరారోడ్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నా అర్ధరాత్రి కావటంతో రిజిస్ట్రేషన్‌ చేయటానికి ఆరోగ్యమిత్ర అందుబాటులో లేడు. దీంతో పేషంట్‌ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో చేసేదిలేక డబ్బులు పెట్టి యాంజియోగ్రామ్‌ చేయించి, స్టంట్లు వేయించారు.

●ఇలా రోజూ ఎందరో నిరుపేద, మద్యతరగతి రోగులు ఆరోగ్యశ్రీ సేవలకు అర్హులైనప్పటికీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల డబ్బుల దాహానికి బలవుతున్నా రు. అంతే కాకుండా సరిపోను ఆరోగ్యమిత్రలు లేకపోవటం కూడా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వరంలా మారిపోయింది. మిత్రల కొరతతో ఆయా ఆస్పత్రు ల్లో మూడుషిఫ్టుల్లో పనిచేయాల్సిన వారు కరువయ్యారు. దీంతో ఉన్న వారితోనే నెట్టుకొస్తుండటంతో రోగులు తీవ్రఇబ్బందులు పాలవుతున్నారు. ఆరోగ్య శ్రీ పథకం 2008లో అప్పటి దివంగత ముఖ్యమంత్రిరాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. పాద యాత్ర సమయంలో రోగులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసి చలించిపోయి ఆయన ఆలోచనలో వచ్చిందే ఈ ఆరోగ్యశ్రీ పథకం. అప్పట్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా లక్షల మందికి ఉచితంగా వైద్యసేవలు అందించగా, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సేవలు అందటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 68 మంది మాత్రమే

పథకం ప్రారంభ సమయంలో ఉమ్మడి జిల్లాలో 125 మంది ఆరోగ్యమిత్రలతో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవటంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా లో 68 మంది ఆరోగ్య మిత్రలు మిగిలిపోయారు. అందులో ఖమ్మం జిల్లాలో 38 మంది మిత్రలు పనిచేస్తుండగా, భద్రాద్రికొత్తగూడెంలో 30మంది సేవలు అందిస్తున్నారు. జిల్లా రెండుగా విడిపోయినా ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాకు కలిపి ఖమ్మం కేంద్రంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సేవలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో అవసరమైనస్థాయిలో ఆరోగ్యమిత్రలు లేకపోవటం వల్ల రోగులకు ఆయుష్మాన్‌, ఆరోగ్యశ్రీ సేవలు అశించినస్థాయిలో అందట్లేదు. ఆరోగ్యశ్రీట్రస్ట్‌ ఏర్పడిన సమయంలో ఉమ్మడి జిల్లాలో కేవలం 10 ఆస్పత్రులకే అనుమతు లు ఉండేవి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభు త్వ, ప్రైవేట్‌ ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు 55 వరకు ఉన్నా యి. అందులో ఖమ్మం జిల్లాలో 31 ప్రైవేట్‌, 8 ప్రభు త్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యసేవలు అందుబాటులో ఉన్నా యి. భద్రాద్రి కొత్తగూడెంలో 9 ప్రైవేట్‌, 7 ప్రభుత్వ ఆస్పత్రులకు అనుమతులు ఉన్నాయి.

7 లక్షలకు పైగా అర్హులు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు పొందే అవకాశం లభించింది. దీంతో ఆరోగ్యశ్రీ సేవ లకు ప్రాముఖ్యత పెరిగింది. కానీ, రోగులకు అనుకున్నస్థాయిలో వైద్య సేవలు అందట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్న కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు ఎక్కువగా ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్నప్పటికీ పలురకాల కొర్రీలు పెట్టి రోగులకు ఉచితసేవలు అందకుండా చేస్తున్నారు. ఒక్కోసారి కొన్ని ఆస్పత్రుల్లో ఇక్కడ ఆరోగ్యశ్రీసేవలు లేవని బుకాయిస్తూ డబ్బులు చెల్లించేలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఉమ్మడి జిల్లాలో 7,12,461 రేషన్‌కార్డులు ఉండగా వారంతా ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌కు అర్హులే. రోగి ఆయా ఆస్పత్రులకు వచ్చి సేవలు పొందే సంమయంలో ఆరోగ్యమిత్రలదే కీలక పాత్ర. అర్హులైన రోగులకు రిజిస్ట్రేషన్‌, ట్రస్ట్‌ నుంచి అనుమతులు పొందడంతోపాటు డిశ్చార్జ్‌ అయ్యే వరకు వారి సేవలు కీలకం. సరిపోను ఆరోగ్యమిత్రలు లేకపోవటం ఇబ్బందిగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఉన్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు గాను సుమారు మరో 100మంది ఆరోగ్యమిత్రలు అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నా రు. సాధారణంగా ఆరోగ్యమిత్రలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రిషిఫ్ట్‌లు చేయాల్సి ఉంటుంది. కానీ, సరిపోను సిబ్బంది లేక ఇబ్బందులు తప్పట్లేదు. ముఖ్యంగా రాత్రిసమయాల్లో అత్యవసర సేవలు పొందేందుకు వచ్చేవారు ఆరోగ్యమిత్రలు అందుబాటులో లేక డబ్బులు చెల్లించి వైద్య సేవలు పొందాల్సి వస్తోంది. కొందరు ఆర్‌ఎంపీల మూలంగా కూడా ఆరోగ్యశ్రీ సేవలకు అర్హులైన రోగులు దూరమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కమీషన్లకు కక్కుర్తి పడి గ్రామాల్లో రోగులను ప్రైవేట్‌ ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు తీసుకొచ్చి చేర్పించి, వారితో డబ్బులు కట్టిస్తున్నారు. ఆ తర్వాత అక్కడ ఆరోగ్యశ్రీ ఉందనే విషయం తెలుసుకొని రోగులు లబోదిబోమంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఆరోగ్యమిత్రల కొరత ఉన్నా సర్దుకుంటూ పో తున్నాం. ఏ ఆస్పత్రి నుంచైనా ఫిర్యాదు అందితే విచారణ చేసి సంబంధిత రోగికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవే ట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు నిర్లక్షం చేస్తే ఫిర్యా దు చేయాలి.

–పి.శ్రీనివాస్‌, ఉమ్మడి జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్‌

ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్‌1
1/1

ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement