
ఏడుబావుల జలపాతం వద్ద యువకుడు మృతి
ఇల్లెందు: మండలంలోని ఏడుబావుల జలపాతం సొరికలో ఇరుక్కుని ఏన్కూరు మండలం జెన్నారం గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్ మృతి చెందాడు. ఆదివా రం ఆయన మృతదేహా న్ని వెలికితీశారు. ఐదారేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో 9 మంది మృతి చెందారు. గతంలో ఏడుబావుల జలపాతం వద్దకు వెళ్లకుండా అధికారులు దారి మూసివేశారు. ‘సాక్షి’లో వచ్చిన కథనాలకు స్పందించిన అధికారులు ఏడుబావులకు వెళ్లే రహదారికి అడ్డంగా కంచె కట్టి, ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయినా ఇల్లెందు మండలం నుంచి ఏడుబావుల సందర్శనకు చాలామంది అటవీ మార్గం నుంచి వెళ్తున్నారు. గుట్ట మీదుగా వెళ్లి ఏడుబావుల అందాలను తిలకించే ప్రయత్నంలో జారి పడి మృతి చెందుతున్నారు. ఓ బావిలో సొరికె ఉండటం, అటుగా వెళ్లిన వారు అందులో కూరుకుని, ఊపిరి ఆడక ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా ప్రేమ్‌కుమార్ మృతితోనైనా ఏడుబావుల సందర్శన నిలిపివేయాల్సిన అవసరం ఉంది.
గోడ కూలి వృద్ధురాలికి గాయాలు
అశ్వాపురం: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని మల్లెలమడుగు గ్రామంలో వృద్ధురాలు యన్నం రాములమ్మ ఇంటికి సంబంధించిన మట్టి గోడలు ఆదివారం కూలాయి. ఇంట్లో ఉన్న రాములమ్మకు స్వల్ప గాయాలయ్యాయి.

ఏడుబావుల జలపాతం వద్ద యువకుడు మృతి