
పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
టేకులపల్లి: కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం మండలంలో పర్యటించింది. బుధవారం సేద్య విభాగపు శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్. హేమశరత్‌చంద్ర, ఉద్యాన శాస్త్రవేత్త బి.శివ మండలంలోని బోడు గ్రామంలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. పత్తి పంటలో నీరు నిల్వకుండా చూసుకోవాలని సంచించారు. అధిక తేమతో వేరుకుళ్లు, మెగ్నీషియం ధాతు లోపం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వేరుకుళ్లు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాము లు లీటర్ నీటికి లేదా కార్బండిజమ్ 1 గ్రాము లీటర్ నిటికి కలిపి ప్రత్తి మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోయిన ప్రదేశాల్లో మొక్కల మొదళ్లలో పోయాలని పేర్కొన్నారు. అధిక తేమ ఉన్న పరిస్థితుల్లో మొక్క పోషకాలను తీసుకోలేదు కాబట్టి 191919 లేదా 13045 (మల్టీకే) 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలని చెప్పారు. వెదజల్లే పద్ధతిలో విత్తిన వరి క్షేత్రాన్ని పరిశీలించి, కలుపు నివారణకు స్టైలోపాప్ బ్యూటైల్ పెనాక్సులమ్ లీటర్ కలుపు మందును, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కె.రమేశ్, భూక్య సైదులునాయక్, నరేందర్, సక్రు తదితరులు పాల్గొన్నారు.