
కమనీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి బుధవారం నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
రామయ్యకు విరాళాల వెల్లువ
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి బుధవారం పలువురు భక్తులు విరాళం అందించారు. శాశ్వత నిత్యాన్నదానానికి ఖమ్మానికి చెందిన కొండపల్లి వెంకటేశ్వరరావు, రాధ దంపతులు రూ.1,00,100, శ్రీరంగం వకుళ భాష్యం రూ.లక్ష ఆలయ ఈఓకు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఏఏ కామేశ్వరరావు, అవసరాల విజయలక్ష్మి దంపతులు రూ.ఆరు లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వామివారికి సమర్పించారు. దాతలకు ఈఓ రమాదేవి రశీదు అందజేశారు.
పంద్రాగస్టుకు ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా కేంద్రంలోని ప్రగతిమైదానంలో జరిగే 79వ స్వాతంత్య్ర వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి తుమ్మల వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
మంత్రి తుమ్మలను కలిసిన సబ్ కలెక్టర్
దమ్మపేట: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును గండుగులపల్లిలోని ఆయన నివాసంలో బుధవారం కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. సత్తుపల్లి తహసీల్దార్ సత్యనారాయణ పాల్గొన్నారు.
డ్రైవింగ్ శిక్షణతో
ఉపాధి పొందాలి
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం: డ్రైవింగ్‌ను నేర్చుకుని ఉపాధి పొందాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. బుధవారం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 రోజులపాటు శిక్షణ ఉంటుందని, అనంతరం నిర్వహించే టెస్టులో ఉత్తీర్ణులయితే డ్రైవింగ్ లైసెన్సులను అందిస్తామని తెలిపారు. తద్వారా జెన్‌కో, ఐటీసీ, నవభారత్ వంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని, సొంత వాహనాలు సమకూర్చుకుని యజమానులుగా మారవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ, డ్రైవింగ్ స్కూల్ శిక్షకురాలు మల్లేశ్వరి పాల్గొన్నారు.

కమనీయంగా రామయ్య కల్యాణం

కమనీయంగా రామయ్య కల్యాణం

కమనీయంగా రామయ్య కల్యాణం