
క్రిస్టియన్ మైనారిటీల సమస్యలు పరిష్కరిస్తాం
సూపర్‌బజార్(కొత్తగూడెం): క్రిస్టియన్ మైనారిటీల సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో పాస్టర్స్ అసోసియేషన్‌తో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో శ్మశానవాటికలు, అభ్యంతరం లేని చర్చిలకు అనుమతులు, కులధ్రువీకరణ పత్రాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం తదితర సమస్యలను సమావేశంలో చర్చించారు. అనంతరం కలెక్టర్‌ను సన్మానించారు. ఈ సమావేశంలో క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ దీపక్‌జాన్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కె.సంజీవరావు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్య, సరైన సదుపాయాలు
బూర్గంపాడు : విద్యార్థినిలకు నాణ్యమైన విద్యతోపాటు సరైన సదుపాయాలు శుభ్రమైన వసతి, పోషకాహారంతో కూడిన భోజనం అందించినప్పుడే విద్యలో ఉత్తమ ఫలితాలు వస్తాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం ఆయన బూర్గంపాడు తెలంగాణ గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల, హాస్టల్‌ను తనిఖీ చేశారు. వంటగది, భోజనశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. సదుపాయాలు, మెనూ అమలుపై ఆరా తీశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని అన్నారు. పాఠశాల ప్రాంగణంలో మునగ, కరివేపాకు, నిమ్మ గడ్డి వంటి మొక్కలను నాటించాలని సూచించారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్