
సింగరేణి అధికారుల నిరసన
సింగరేణి(కొత్తగూడెం): ఫెర్ఫామెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) కోసం సింగరేణి అధికారులు చేపట్టిన ఆందోళన బుధవారం రెండోరోజుకు చేరింది. బుధవారం అధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) నాయకులు మాట్లాడుతూ 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పీఆర్పీ పెండింగ్‌లో ఉందన్నారు. కోలిండియాలో ఏటా చెల్లిస్తున్నా, సింగరేణిలో రెండేళ్లుగా చెల్లించడం లేదని ఆరోపించారు.
మణుగూరు రూరల్ : పీఆర్పీ చెల్లించాలని కోరుతూ మణుగూరు ఏరియాలోని పీకేఓసీ–2 అధికారులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చే శారు. వీరికి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వై.రాంగోపాల్, ఓసీ–2 ఫిట్ సెక్రటరీ శనిగరపు కుమారస్వామి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కె.సురేష్‌కుమార్, రామ్‌శంకర్, భూక్యా భాంగ్యా, నరేష్, మెరుగు లింగబాబు, బుడ్డి బాబ్జీ, సుధాకర్‌బాబు, ఎం.యుగంధర్, చక్రవర్తి పాల్గొన్నారు.