
సాంకేతిక నైపుణ్యం అందిపుచ్చుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: పిల్లలు చిన్నతనం నుంచే సాంకేతిక నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో నూతనంగా ప్రవేశపెట్టిన డిజిటల్ లిటరసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కాంప్లెక్స్ స్థాయి రిసోర్స్ పర్సన్లకు కొత్తగూడెంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు గణితం సబ్జెక్ట్‌లో డిజిటల్ లిటరసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశాలను చేర్చినట్లు తెలిపారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించాలని, ప్రాథమిక స్థాయి విద్య పటిష్టంగా ఉంటే ఉన్నత స్థాయి రాణిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ.నాగరాజ శేఖర్, శ్రీనివాసరావు, శంకర్, స్వర్ణకుమారి, రవిబాబు, నరేష్ కుమార్ పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి