
అనారోగ్యంతో పదో తరగతి విద్యార్థిని మృతి
అశ్వారావుపేటరూరల్: అనారోగ్యంతో బాధపడుతు న్న ఓ విద్యార్థిని సోమవారం మృతిచెందింది. స్థానికుల కథ నం ప్రకారం..అశ్వారావుపేట లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పేటమాలపల్లికి చెందిన ఎన్. లౌఖిక(14) కొద్దిరోజులుగా ఫిట్స్‌తో బాధపడుతోంది. కుటుంబీకులు ఓ వైద్యశాలలో చికిత్స చేయించారు. సోమవారం ఉదయం కూడా ఫిట్స్ రాగా, ఆస్పత్రికి తరలించేలోపే పరిస్థితి విషమించి మృతి చెందింది. పాఠశాల హెచ్‌ఎం పి.హరిత, ఉపాధ్యాయులు మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. కుటుంబీకులకు సానుభూతి ప్రకటించారు. విద్యార్థిని మృతితో పాఠశాలకు సెలవు ప్రకటించారు.
చికిత్స పొందుతున్న
వ్యక్తి..
దమ్మపేట: భార్య మందలించిందనే కారణంగా ఆత్మన్యూనతా భావంతో కలుపు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని పట్వారిగూడెం గ్రామానికి చెందిన సింగిచ్చి ఏసురాజు(48) కొంతకాలంగా మద్యానికి బానిసగా మారి కుటుంబ పోషణను పట్టించుకోవడంలేదు. దీంతో విసుగుచెందిన భార్య కృష్ణవేణి శనివారం అతడిని మందలించింది. క్షణికావేశంలో ఏసురాజు కలుపు మందు తాగి, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అదనపు ఎస్సై బాలస్వామి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
కౌలు రైతు..
అశ్వాపురం: మండల పరిధి లోని గోపాలపురం గ్రామం వద్ద మణుగూరు–కొత్తగూడెం ప్రధా న రహదారిపై ఆది వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కౌలు రైతు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సర్వాయిపాడు బంజర గ్రామానికి చెందిన రైతు సోడే మంగయ్య(36) మణుగూరు మండలం కూనవరంలో భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. రోజూ ఉదయం పొలానికి రాత్రి ఇంటికి వస్తాడు. ఆదివారం కూడా పొలానికి వెళ్లి ఎరువులు చల్లాడు. రాత్రి బైక్‌పై ఇంటికి వస్తుండగా గోపాలపురం వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టడంతో మంగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం భద్రాచలం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై మధుప్రసాద్ కేసు నమోదుచేశారు.

అనారోగ్యంతో పదో తరగతి విద్యార్థిని మృతి