
పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలి
టేకులపల్లి: గుడుంబాలో కల్తీ వల్లే తన కుమారుడు మృతి చెంది ఉంటాడని, పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని మృతుడి తండ్రి ఆర్‌ఎంపీ యనగంటి అర్జున్‌రావు, ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి టేకులపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన కుమారుడు ఆర్‌ఎంపీ రవికాంత్ గత నెల 27న కొందరు స్నేహితులతో కలిసి మండల కేంద్రంలోని బోడ బజారులో ఓ ఇంట్లో గుడుంబా తాగాడని పేర్కొన్నారు. ఈ గుడుంబా విక్రయించే కుటుంబం గతంలో రవికాంత్‌తో తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారని తెలిపారు. గత నెల 27న ముఖానికి మాస్కు ధరించిన ఇద్దరు వ్యక్తులు తన కుమారుడిని తీసుకొచ్చి, ఇంటి ముందు వదిలేసి వెళ్లినట్లు స్థానికులు చెప్పారని తెలిపారు. గుడుంబాలో కల్తీ వల్లే తమ కుమారుడు మృతి చెంది ఉంటాడని, పోలీసులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మార్పీఎస్ నాయకులు మెంతెన ప్రభాకర్, నల్లగట్ల వెంకన్న, జినక ఇస్తారి, సతీష్, వెంకన్న పాల్గొన్నారు.