
ఆనాటి హామీలు ఏమాయె?
పొదల్లో చిక్కుకున్న కాటేజీలు..
గతేడాది ఇదే రోజున కిన్నెరసానికి ముగ్గురు మంత్రులు
అభివృద్ధి చేస్తామని అమాత్యుల భరోసా
నేటికీ అమలుకు నోచని వాగ్దానాలు
బోటింగ్ పాయింట్
నుంచి కాటేజీకి
వెళ్లే రోడ్డు ఇలా..
రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతేడాది ఆగస్టు 12న కిన్నెరసానిలో క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారు. బోటులో సుమారు రెండు గంటల పాటు జలాశయంలో విహరించారు. జలాశయం మధ్యలో ఉన్న ‘ఆనంద ద్వీపం’ కాన్సెప్టును దగ్గరి నుంచి పరిశీలించారు. బోటులోనే మధ్యాహ్న భోజనం కూడా చేశారు. అనంతరం కిన్నెరసానితో పాటు జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముగ్గురూ హామీ ఇచ్చారు. కానీ.. ఏడాది పూర్తయినా వారి హామీల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. దీంతో ప్రగతి భవన్ పరిపాలనైనా, ప్రజాపాలనైనా జిల్లాలో పర్యాటక రంగానికి ఒనగూరిన ప్రయోజనమేమీ లేదనే విమర్శలు వస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
పొదల్లో చిక్కుకున్న కాటేజీలు..
ఇల్లెందు క్రాస్‌రోడ్ వద్ద నిర్మాణంలో ఉన్న హరిత కాకతీయ హోటల్, హరిత కన్వెన్షన్ సెంటర్లకు సంబంధించి మిగిలిన పనులను 2024 నవంబర్ నాటికి పూర్తి చేస్తామని, ముక్కోటికి భద్రాచలం వచ్చే భక్తులు, పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ముక్కోటితో పాటు శ్రీరామ నవమి పర్వదినాలు వచ్చి పోయినా ఈ రెండు పనులు నేటికీ పూర్తి కాలేదు. శిల్పాన్ని చెక్కినట్టుగా ఇక్కడ ప్రతీ పని నెలల తరబడి సాగుతోంది. ఇదే క్యాంపస్‌లో సివిల్ నిర్మాణం పూర్తయి ఇంటీరియర్ పనులు పెండింగ్‌లో ఉన్న పది కాటేజీలు (20 గదులు) సంగతి ఏంటన్న అంశంపై ఎవ్వరి దగ్గరా స్పష్టమైన సమాధానం లేదు. కాటేజీలను పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కల పొదల్లో చిక్కుకుపోయాయి.
సా..గుతున్న పర్యాటక పనులు
● గతేడాది ఇదే రోజున కిన్నెరసానికి ముగ్గురు మంత్రులు
● అభివృద్ధి చేస్తామని అమాత్యుల భరోసా
● నేటికీ అమలుకు నోచని వాగ్దానాలు

ఆనాటి హామీలు ఏమాయె?

ఆనాటి హామీలు ఏమాయె?