
కేజీబీవీలకు ఆదరణ..
● కస్తూర్బా కళాశాలల్లో పెరిగిన అడ్మిషన్లు ● ఫలితమిచ్చిన ఇంటింటి ప్రచారం ● ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 8,234 మంది చేరిక ● మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 15 వరకు అవకాశం
పాల్వంచరూరల్ : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కేజీబీవీల్లో చదివే విద్యార్థినులకు ఉచిత భోజనం, వసతి, దుస్తులు ఇవ్వడంతో పాటు నాణ్యమైన బోధన అందుతోంది. గత వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఇంటింటికీ తిరిగి ఈ మేరకు ప్రచారం కల్పించారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని 28 కస్తూర్బాగాంధీ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఈ ఏడాది 8.234 అడ్మిషన్లు నమోదయ్యాయి. జిల్లాలోని 14 విద్యాలయాల్లో అడ్మిషన్లు ఆశాజనకంగా ఉన్నాయని జీసీడీఓ అన్నామణి తెలిపారు. కొన్ని కళాశాలల్లో కొంత తగ్గినా.. మొత్తంగా చూస్తే ప్రవేశాల సంఖ్య పెరిగిందని వివరించారు.
ఉమ్మడి జిల్లాలో 544 సీట్లు ఖాళీ..
ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్య పెరిగినా ఉమ్మడి జిల్లా కేజీబీవీల్లో ఇంకా 544 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిలో భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో 49, అన్నపురెడ్డిపల్లి 30, భద్రాచలం 37, బూర్గంపాడు 11, చండ్రుగొండ 20, చర్ల 32, దుమ్ముగూడెం 25, గుండాల 10, జూలూరుపాడు 11, కరకగూడెం 30, ములకలపల్లి 10, పాల్వంచ 10, పినపాక 40, టేకులపల్లి 44 సీట్లు ఉండగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 23, పెనుబల్లి 34, సింగరేణి 20, లింగాల 24, బోనకల్ 24, కూసుమంచి 23, ఏన్కూర్ 14, కొణిజర్ల 15, ముదిగొండ 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
15 వరకు స్పాట్ అడ్మిషన్లు
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి డీఈఓ ఆదేశాల మేరకు ఈనెల 15 వరకు స్పాట్ ఆడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తాం. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల మొదటి వారంలో కూడా స్పాట్ అడ్మిషన్లు నిర్వహించడంతో గతేడాది కంటే విద్యార్థినుల సంఖ్య పెరిగింది.
– ఎం.తులసి, సమగ్రశిక్షా అభియాన్ జీసీడీఓ, ఖమ్మం
జిల్లాలోని కస్తూర్బా కళాశాలల్లో గత, ప్రస్తుత విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల వివరాలిలా..
2024–25 2025–26
అళ్లపల్లి 261 245
అన్నపురెడ్డిపల్లి 333 333
భద్రాచలం 277 254
బూర్గంపాడు 276 250
చండ్రుగొండ 307 305
చర్ల 156 165
దుమ్ముగూడెం 239 227
గుండాల 247 249
జూలూరుపాడు 266 252
కరకగూడెం 289 299
ములకలపల్లి 302 342
పాల్వంచ 308 336
పినపాక 247 276
టేకులపల్లి 172 186
మొత్తం 3,680 3,719

కేజీబీవీలకు ఆదరణ..