
సీఎం, ప్రతిపక్ష నేతా మోసగాళ్లే
ఇల్లెందు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇద్దరూ మోసగాళ్లేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. ఆదివారం ఇల్లెందు మార్కెట్ యార్డులో జరిగిన దివ్యాంగుల సభలో ఆయన మాట్లాడారు. దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలను మోసం చేశారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పింఛన్ రూ. 2 వేలు పెంచుతామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా పెంచలేదని విమర్శించారు. పింఛన్ పెంచని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షాలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వెళ్లకుండా ఫాం హౌస్‌లో సేద తీరుతున్నారని, ఇలాంటి ప్రతిపక్ష నేతను దేశంలో ఏ రాష్ట్రంలోనూ చూడలేదని పేర్కొన్నారు. పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 3న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పింఛన్‌దారులు ఆందోళనకు తరలి రావాలని కోరారు. సంఘాల నాయకులు ఏడుకొండలు, మెంతెన వసంతరావు, శ్రావణ్, అన్నీ, జినక ఇస్తారీ, నల్లగట్ల వెంకన్న, మెంతెన ప్రభాకర్, రాజ్‌కుమార్, యశోద, వెంకన్న, నవీన్, రాజేందర్, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక
అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ