
‘బీసీ’ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలి
సింగరేణి(కొత్తగూడెం): తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని చిల్డ్రన్స్‌పార్క్ వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అమలుపై బీజేపీ రెండు నాలుకల ధోరణి వీడాలని అన్నారు. తెలంగాణలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కె.బ్రహ్మాచారి, అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్ తదితరులు పాల్గొన్నారు.