కిన్నెరసాని ఒక గేటు ఎత్తివేత | - | Sakshi
Sakshi News home page

కిన్నెరసాని ఒక గేటు ఎత్తివేత

Aug 11 2025 6:44 AM | Updated on Aug 11 2025 6:44 AM

కిన్న

కిన్నెరసాని ఒక గేటు ఎత్తివేత

పాల్వంచరూరల్‌: ఎగువన కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని జలాశయానికి వరద కొనసాగుతోంది. 407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం కలిగిన కిన్నెరసాని రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 1,000 క్యూసెక్కుల వరదనీరు రావడంతో ఆదివారం నీటిమట్టం 404.70 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టుకు చెందిన ఒక గేటును రాత్రి 10గంటలకు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలినట్లు ఏఈ తెలిపారు. నది దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఉత్సాహంగా

టీటీ ఎంపికలు

ఖమ్మం స్పోర్ట్స్‌ : ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఎంపికలకు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచి 120 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. ప్రారంభ కార్యక్రమంలో డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడుతూ టేబుల్‌ టెన్నిస్‌ బోర్డులకు ప్రత్యేక హాల్‌ నిర్మిస్తున్నామని, ప్రతీ క్రీడాకారుడు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేలా రాణించాలని ఆకాంక్షించారు. టీటీ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాలసాని విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులకు తమ సంఘం ఆధ్వర్యాన పది రోజుల పాటు శిక్షణ ఇచ్చి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ బాధ్యులు జోజిచాకో, షేక్‌ ముజాఫర్‌, పరిటాల చలపతి, రెడ్డి సాయి, శివ, రామారావు పాల్గొన్నారు.

ముగిసిన నాటిక పోటీలు

ఖమ్మంగాంధీచౌక్‌: తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు ఆదివారం ముగిశాయి. ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన ఈ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కళాసంస్థలు తొమ్మిది నాటికలు ప్రదర్శించాయి. సమాజ చైతన్యం, మూఢనమ్మకాలు, కొత్తపోకడలు, పాశ్చాత్య సంస్కృతి వంటి ఆంశాలపై ప్రదర్శించిన నాటికలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. ఆదివారం హైదరాబాద్‌ గోవాడ క్రియేషన్స్‌ వారు ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటికను ప్రదర్శించారు. జ్యోతిరాజ్‌ బీశెట్టి రచించిన ఈ నాటికకు డాక్టర్‌ వెంకట్‌ గోవాడ దర్శకత్వం వహించారు. ఇక విశాఖపట్టణానికి చెందిన చైతన్య కళాస్రవంతి వారు (అ)సత్యం నాటికను ప్రదర్శించారు. చివరి రోజు నెల నెలా వెన్నెల నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రి వైద్యులు సీహెచ్‌.ఎన్‌. రాజకుమారి హాజరయ్యారు. కార్యక్రమంలో స్థానిక విద్యావేత్తలు వంగా సాంబశివరావు, చైతన్య విద్యాసంస్థల అధినేత మల్లెంపాటి శ్రీధర్‌, హార్వెస్ట్‌ విద్యాసంస్థల అధినేత రవిమారుత్‌, నెల నెలా వెన్నెల నిర్వాహకులు ఎ.సుబ్రహ్మణ్యకుమార్‌, డాక్టర్‌ నాగబత్తిని రవి, జగన్మోహన్‌రావు, కురువెళ్ల ప్రవీణ్‌, వేముల సదానందం, నామా లక్ష్మీనారాయణ, వేల్పుల విజేత, మొగిలి శ్రీనివాసరెడ్డి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

కల్లూరు: ఓ కంపెనీ వార్షికోత్సవ వేడుకలో కులంపేరుతో దూషించి, అవమానించిన ముగ్గురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 7న మధ్యాహ్నం కల్లూరు స్వాగత్‌ రెస్టారెంట్‌లో బేయర్‌ ఆగ్రో పురుగుమందుల కంపెనీ వార్షి కోత్సవాన్ని పురస్కరించుకుని విందు ఏర్పా టు చేశారు. ఈ విందులో పాల్గొన్న కల్లూరు మండలం వాచ్యానాయక్‌ తండాకు చెందిన బానోత్‌ ప్రసాద్‌ను లింగాల గ్రామానికి చెంది న దేవరపల్లి వెంకటరావు, మట్టూరి రాజేష్‌, దేవరపల్లి అశోక్‌లు కులం పేరుతో దూషించి, అవమాన పరిచారు. దీంతో బాధితుడు ప్రసా ద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ ముగ్గురుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి ఏసీపీ రఘు ఆధ్వర్యాన దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ హరిత పేర్కొన్నారు.

కిన్నెరసాని ఒక గేటు ఎత్తివేత
1
1/2

కిన్నెరసాని ఒక గేటు ఎత్తివేత

కిన్నెరసాని ఒక గేటు ఎత్తివేత
2
2/2

కిన్నెరసాని ఒక గేటు ఎత్తివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement