డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ

Aug 11 2025 6:44 AM | Updated on Aug 11 2025 6:44 AM

డివైడ

డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ

మణుగూరు టౌన్‌: మండలంలోని సమితిసింగారం అశోక్‌నగర్‌ సాయినగర్‌ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఓ లారీ డివైడర్‌పైకి దూసుకెళ్లింది. స్థానికుల కథనం ప్రకారం.. రాత్రి వేళ ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్‌తో రోడ్డు సక్రమంగా కనిపించలేదు. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ప్రయత్నంలో లారీ డ్రైవర్‌పైకి దూసుకెళ్లింది. అయితే ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొత్తగా నిర్మాణంలో ఉన్న డివైడర్‌కు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నిర్మాణంలో ఉన్న డివైడర్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వీధి లైట్లు అమర్చాలని కోరుతున్నారు.

కూలిన స్తంభం..

తప్పిన ప్రమాదం

తిరుమలాయపాలెం: విద్యుత్‌ అధికారుల పర్యవేక్షణ లోపంతో నూతనంగా ఏర్పాటు చేసిన స్తంభం కూలిపోయింది. అప్పటివరకు అక్కడే ఆడుకున్న చిన్నారులు వర్షం వస్తుండగా ఇళ్లలోకి వెళ్లాక స్తంభం కూలడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ఈ ఘటన మండలంలోని హైదర్‌సాయిపేట శివారు రావిచెట్టుతండాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఇళ్లపై ఉన్న విద్యుత్‌ తీగలు తొలగింపునకు ఆయా గ్రామాల్లో విద్యుత్‌ కాంట్రాక్టర్‌తో స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం రావిచెట్టుతండాలో విద్యుత్‌ స్తంభం వేశారు. ఆ సమయంలో ఐదు నుంచి ఆరు అడుగుల మేర లోతున గుంత తవ్వాల్సి ఉండగా బండ రావడంతో రెండడుగులు మాత్రమే తవ్వి స్తంభం వేశారు. విద్యుత్‌ అధికారుల పర్యవేక్షణలో స్తంభం ఏర్పాటు చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్‌ ఇవేమీ పట్టించుకోకుండా రెండడుగుల గుంతలో తొమ్మిఇ మీటర్ల ఎత్తుగల స్తంభం ఏర్పాటు చేశారు. దీంతో ఆదివారం వర్షానికి స్తంభం కూలగా గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వ్యక్తి అదృశ్యంపై కేసు

దమ్మపేట: భార్య మందలించిందనే కారణంతో ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన ఇది. మండలంలోని దమ్మపేట గ్రామానికి చెందిన దారావత్‌ రాము(35) అనే వివాహితుడు తరచూ మద్యం తాగుతూ, కుటుంబపోషణను పట్టించుకోవడం లేదు. దీంతో విసుగుచెందిన అతడి భార్య భవాని శనివారం రాత్రి మందలించగా.. అతడు మనస్తాపంతో ఆదివారం తెల్లవారుజామున మందలపల్లి బస్టాండ్‌లో బస్సు ఎక్కి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు అతడు ఇంటికి రాకపోగా.. ఆచూకీ కూడా తెలియకపోవడంతో భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్‌రెడ్డి తెలిపారు.

డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ1
1/1

డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement