
● మ్యూజియాన్ని మరిపించేలా..
భద్రాచలం ట్రైబల్ మ్యూజియాన్ని చిత్రం భళారే అన్నట్టుగా ఐటీడీఏ పీఓ సతీమణి మనీషా రాహుల్ గీశారు. తన పెయింటింగ్ రూపంలో సహజత్వాన్ని సిద్ధించేలా ట్రైబల్ మ్యూజియం ముఖద్వారం రూపుదిద్దుకోవడం ఆమె పెయింటింగ్ కళావైభవానికి ప్రత్యేకంగా చెప్పొచ్చు. వృత్తిపరంగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలైనా.. కవితలు, కథలు, శీర్షికలు రాయడం, చదవడం ఆమె అభిరుచి. పెయింటింగ్ వేయడంలోనూ సిద్ధహస్తురాలు. అయినా భద్రాచలంలోని చెవిటి, మూగ పాఠశాల చిన్నారులకు తినుబండారాలు, భోజన సౌకర్యం కల్పిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని చూసిన పలువురు మనీషాకు అభినందనలు తెలిపారు. – భద్రాచలంటౌన్