
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో అనువైన ప్రదేశాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క, రాష్ట్రమైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి(ఎనర్జీ) నవీన్ మిట్టల్, జెన్‌కో సీఎండీ, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ, సింగరేణి సీఎండీలతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నతాధికారులతో సోలార్ సిస్టం ఇన్‌స్టలేషన్‌పై వీడి యో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో సోలార్ విద్యుదుత్పత్తికి చేపట్టను న్న చర్యలను కలెక్టర్ వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.