నేడు మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

Aug 9 2025 5:07 AM | Updated on Aug 9 2025 5:07 AM

నేడు

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీతో పాటు రఘునాథపాలెం, వైరా, బోనకల్‌ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లోని పలు ప్రైవేట్‌ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు.

సేవకులు ముందు

వరుసలో ఉండాలి

చర్ల: క్రీస్తు పరిచర్యను కొనసాగించేందుకు సేవకులు ముందు వరుసలో ఉండాలని అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండిపెండెంట్‌ క్రిస్టియన్‌ కమిటీ (ఏఐసీసీ) రాష్ట్ర అధ్యక్షుడు రెవరెండ్‌ ఏనోశ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం చర్ల మండలంలోని సీ–కత్తిగూడెంలో టీజీఎం ప్రార్థనా మందిరంలో మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమా వేశం నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లా డారు. ఒడిదుడుకులను అధిగమించి ముందు కు సాగితేనే సేవా పరిచర్య సాగించడం సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం చర్ల మండల ఏఐసీసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బండివిజయ్‌ఆనంద్‌, ఐ.ఇమ్మానియోల్‌ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నా రు.ఉపాధ్యక్షులుగా వై.లాజర్‌,కార్యదర్శిగా ఇప్పా ప్రభుదాస్‌, సహాయ కార్యదర్శిగా కె.బర్నబస్‌, ఈసీ మెంబర్లుగా బాలరాజు, పాల్‌రాజు, సంసో న్‌, యేసు దాసును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో డి.డేవిడ్‌రాజు, డి.బాలరాజు పాల్గొన్నారు.

గుడుంబా స్థావరాలపై దాడులు

బూర్గంపాడు: బూర్గంపాడుకు సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులలోని గుడుంబా స్థావరాలపై శుక్రవారం రెండు రాష్ట్రా ల ఎకై ్సజ్‌శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కిన్నెరసాని నదిఒడ్డున గుడుంబా తయారీ స్థావరాలతో స్థానిక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు రెండు రాష్ట్రాల ఎకై ్సజ్‌ అధికారులు దాడులు నిర్వహించి, 30 డ్రమ్ముల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్స జ్‌ సీఐ రహీమున్నీసా పాల్గొన్నారు.

హత్యాయత్నం

కేసు నమోదు

ఇల్లెందు: మద్యానికి డబ్బులు లేవని చెప్పడంతో భార్యను హత్యచేసేందుకు యత్నించిన వ్యక్తిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పట్టణానికి చెందిన నాగరాజు.. తెల్లవారుజామ ను 3 గంటల సమయంలో భార్య ప్రియాంకను నిద్రలేపి, మద్యానికి డబ్బులు అడిగాడు. ఆమె లేవని చెప్పడంతో కత్తితో తలపై దాడి చేశాడు. మెడ పట్టుకుని చంపేందుకు యత్నించగా.. ఆమె తప్పించికుని సోదరి ఇంటికి వెళ్లి.. ఆస్పత్రిలో వైద్యం పొందింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాగరాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

నేడు మంత్రి  పొంగులేటి పర్యటన 1
1/1

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement