
పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి
పాల్వంచరూరల్ : గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కేంద్ర బృందం సభ్యులు కె.జయంత్,ఎస్.రవిచంద్ర సూచించారు. మండలంలోని పాయకారి యానంబైల్ గ్రామంలో గురువారం వారు పర్యటించారు. గ్రామంలో నిర్మించిన ఇంకుడుగుంతలను పరిశీలించారు. మరుగుదొడ్ల వినియోగం, నీటి సంరక్షణ చర్యలపై ఆరా తీశారు. వారి వెంట ఎంపీడీఓ కె.విజయభాస్కరరెడ్డి, ఎస్‌బీఎం కన్సల్టెంట్ రేవతి, ఎంపీఓ చెన్నకేశవరావు, ఏపీఓ పొరండ్ల రంగా, టీఏ సైదులు, కార్యదర్శులు మధు, శ్రీనివాస్, బాబురావు, దేవ్‌సింగ్, బాబా ఉన్నారు.
యానంబైలులో కేంద్ర బృందం పరిశీలన