
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయండి
డీఐఈఓ వెంకటేశ్వరరావు
బూర్గంపాడు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖా అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు. బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలన్నారు. నీట్, జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చాటి సీట్లు సాధించేలా ప్రత్యేక శిక్షణ తీసుకోవాలన్నారు. విద్యార్థుల యూడైస్, అపార్‌లలో తప్పులుంటే సరిచేయాలన్నారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించాలని అధ్యాపకులను ఆదేశించారు. సమావేశంలో ప్రిన్సిపాల్ చీన్యా, అధ్యాపకులు పాల్గొన్నారు.