
అక్షరాస్యతా ఉద్యమమే ‘ఉల్లాస్’
డీఈఓ నాగలక్ష్మి
కొత్తగూడెంఅర్బన్ : నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ ఉద్దేశమని డీఈఓ నాగలక్ష్మి తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘అండర్‌స్టాండింగ్ ఆఫ్ లైఫ్‌లాంగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ(ఉల్లాస్) అనేది సమాజ సమగ్రాభివృద్ధి కోసం నిర్వహిస్తున్న సామాజిక ఉద్యమమని పేర్కొన్నారు. నిరక్షరాస్యత నిర్మూలనతో పాటు వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం నింపడం, సమాజాన్ని సమానత్వ బాటలో నడిపించే శక్తివంతమైన సాధనం అని వివరించారు. వయోజన విద్య డీడీ అనిల్‌కుమార్ మాట్లాడుతూ శిక్షణలో పొందిన జ్ఞానాన్ని మండల స్థాయిలో అమలు చేసి, ప్రతి నిరక్షరాస్యుడిని అక్షర్యాస్యులుగా మార్చాలని అన్నారు. కోర్సు కో ఆర్డినేటర్ ఎస్‌కే సైదులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని క్రియాశీలంగా అమలు చేయడమే లక్ష్యమని, ప్రతి ఎమ్మార్పీ.. వారి పరిధిలో ఉన్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అనంతరం శిక్షణకు సంబంధించిన ఉల్లాస్ బ్రోచర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కో – ఆర్డినేటర్లు సతీష్‌కుమార్, ఎ. నాగరాజశేఖర్, జె.అన్నామణి, పాపారావు, అరుంధతి పాల్గొన్నారు.