
పాలస్తీనా సంఘీభావ కమిటీ ఆధ్వర్యాన భారీ ర్యాలీ
గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న పాశవిక దాడులను అన్ని వర్గాల ప్రజలూ ఖండించాలని, శాంతి నెలకొల్పేందుకు దేశాధినేతలు కృషి చేయాలని పలువురు నినదించారు. ఖమ్మంలో గురువారం పాలస్తీనా సంఘీభావ కమిటీ ఆధ్వర్యాన భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలు, సంఘాల నాయకులు, యువజనులు, విద్యార్థులు, న్యాయవాదులు, వైద్యులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పెవిలియన్ మైదానం నుంచి మయూరిసెంటర్, వైరా రోడ్డు మీదుగా జెడ్పీ సెంటర్ వరకు ప్రదర్శనగా సాగారు.
పాలస్తీనా ప్రజలకు ఆహారం, నీరు అందకుండా వేలాదిమంది ఆకలి చావులకు కారణమవుతున్న ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ అక్కడి ప్రజల దీనస్థితిని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. –ఖమ్మం మయూరిసెంటర్

● ఆ దాడులు పాశవికం..