
ఇల్లెందులో భారీ వర్షం
● లోతట్టు ప్రాంతాలు జలమయం ● మంచినీటి చెరువుకు అలుగు
ఇల్లెందు/ఇల్లెందురూరల్: మండలంలో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. సుభాష్‌నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని బీడీ కాలనీ, దర్గా వెనక ప్రాంతంలో వరదనీరు ఇళ్లలోకి చేరింది. బీడీకాలనీలో ఆరుబయట గూళ్లలో పదుల సంఖ్యలో ఉన్న కోళ్లు నీట మునిగి మృతి చెందాయి. రహదారులు దెబ్బతిన్నాయి. ఇంటి మెట్లు కూలిపోయాయి. వరదనీటితోపాటు పాములు సైతం కొట్టుకుని రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారే వరకు నీటి ప్రవాహం కొనసాగడంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ఇక ఇల్లెందు తాగునీటి చెరువు అలుగు పోసింది. దీంతో పట్టణ ప్రజలు ఆనందంతో అలుగులో జలకాలాటలు ఆడారు.

ఇల్లెందులో భారీ వర్షం