
సీపీఐ నేత అయోధ్యకు కన్నీటి వీడ్కోలు
మణుగూరు టౌన్: పేదల పక్షపాతి, ప్రజా గొంతుక బొల్లోజు అయోధ్యకు గురువారం కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, గురువారం స్వగ్రామం రామానుజవరంలో అంత్యక్రియలు జరిపారు. సంతాప సభ నిర్వహించగా, పలువురు హాజరై నివాళులర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాష, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య తదితరులు నివాళులర్పించినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్య ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక నిర్బంధాలు ఎదుర్కొని ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. అయోధ్య మృతి పార్టీకి, పినపాక నియోజకవర్గానికి తీరని లోటని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆశయాలు సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు.
కన్నీటి వీడ్కోలు
రామానుజవరంలో భౌతికకాయాన్ని ఉంచగా అన్ని సంఘాల, పార్టీల నాయకులు, యూనియన్ల నేతలు, భవన, రోడ్డు, లారీ, బొగ్గుముఠా, బార్ షాప్ వర్కర్లు, అసంఘటిత రంగ, సంఘటిత రంగ కార్మిక నాయకులు తరలివచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు.
మృతదేహం వద్ద నివాళులర్పించిన
ప్రముఖులు