
ఇంటర్ అడ్మిషన్లు పెంచాలి
పాల్వంచరూరల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు పెంచాలని, కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి తరగతులకు హాజరయ్యే విధంగా చూడాలని ఇంటర్ బోర్డు రాష్ట్ర అబ్జర్వర్ హేమచంద్రరావు ఆదేశించారు. మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం అయిన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల బోధన, బోధనేతర సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సెల్‌నంబర్లను సేకరించి కళాశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని చెప్పారు. విద్యార్థుల ఆధార్, యూడైస్ అపార్‌ను అప్‌డేట్ చేసుకోవాలన్నారు. ప్రతి శనివారం ప్రయోగశాలలో ప్రాక్టికల్స్ నిర్వహించి, మధ్యాహ్న సమయంలో క్రీడలు నిర్వహించాలని సూచించారు. తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలని, బోధన సిబ్బంది రాష్ట్రంలో ఉమ్మడి టైంటేబుల్‌ను అనుసరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, బోధన సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటర్ బోర్డు రాష్ట్ర అబ్జర్వర్
హేమచంద్రరావు