
పక్వానికి వచ్చిన గెలలే తీసుకురావాలి
దమ్మపేట : పామాయిల్ గెలలు పక్వానికి వచ్చిన తర్వాతే ఫ్యాక్టరీకి తీసుకురావాలని, ఈ మేరకు రైతుల్లో చైతన్యం కల్పించాలని ఆయిల్‌ఫెడ్ ఈడీ ప్రశాంత్‌కుమార్ అన్నారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీలను ప్లాంట్ల మేనేజర్ సత్యనారాయణతో కలిసి బుధవారం ఆయన సందర్శించారు. గెలల క్రషింగ్, యంత్రాల పనితీరును పరిశీలించారు. అంతర్గత సమస్యలేమైనా ఉన్నాయా అని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయిల్ రికవరీ శాతం పెరిగేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ మేనేజర్లు కళ్యాణ్, నాగబాబు, కార్తీక్, వెంకట్ పాల్గొన్నారు.